Smart Phones below Rs.20,000 | గతంలో పుస్తకం హస్తభూషణం అని అన్నారు. ప్రస్తుతం ఒక స్మార్ట్ ఫోన్ హస్తభూషణం అన్న నానుడి ఏర్పడింది. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో అరచేతిలోనే అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్లో వాట్సాప్‌తోపాటు క్రెడిట్ కార్డు, గూగుల్ పే, ఫోన్‌పే తదితర పేమెంట్ యాప్స్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్, ఐఆర్సీటీసీ, టీజీఎస్ఆర్టీసీ గమ్యం వంటి ట్రావెల్ యాప్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్) వంటి సోషల్ మీడియా యాప్స్‌తో మనం ఎక్కడున్నా స్మార్ట్‌ఫోన్‌లో మన పని మనం సాఫీగా చేసేయొచ్చు.
అన్నిరకాల యాప్స్, ఫీచర్స్ తోపాటు వైవిధ్య భరితమైన యూజర్ల మనీ ఆప్షన్స్‌కు అనుగుణంగా బాగా పని చేసే సామర్థ్యం, కెమెరాలు, బ్యాటరీ లైఫ్, డిస్ప్లేలు, దీర్ఘకాల సాఫ్ట్వేర్ మద్దతు గల స్మార్ట్ ఫోన్లూ.. రూ.20వేల లోపు ధరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల కోసం భారతీయులు చూస్తున్నారు.
యూజర్ల రోజువారీ వాడకానికి అనుకూల సెగ్మెంట్
ఇతర సెగ్మెంట్ల కంటే రూ.20 వేల లోపు ధర గల స్మార్ట్ఫోన్లు మార్కెట్లో మరింతగా పోటీ పడుతున్నాయి. ఈ రేంజ్ లో కొనుగోలు దారులు తమ అత్యవసర సేవల గురించి రాజీ పడకుండా.. అమోలెడ్ డిస్ప్లేస్, క్యాపబుల్ ప్రాసెసర్లు, పొడవైన బ్యాటరీలు, ఓఐఎస్ ఎనేబుల్డ్ కెమెరా, దీర్ఘకాల సాఫ్ట్వేర్ మద్దతు గల స్మార్ట్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. గేమింగ్, ఫొటోగ్రఫీ, ఎంటర్టైన్మెంట్ సహా రోజువారీ వాడకానికి అనుకూలంగా పలు ఆప్షన్లు గల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ సెగ్మెంట్లో అత్యవసర సేవలకు రోజువారీగా ఉపయోగించుకునే స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేద్దాం..!
మీడియా టెక్డైమెన్సిటీ7400 టర్బో చిప్‌తో ఐక్యూ జడ్11ఎక్స్ 5జీ ( iQOO Z11x 5G)
పనితీరుకు, బ్యాటరీ లైఫ్‌కు ప్రాధాన్యం ఇచ్చే యూజర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి వచ్చిందే ఐక్యూ 11ఎక్స్ 5జీ (iQOO 11x 5G) ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్సెట్ (MediaTek Dimensity 7400 Turbo chipset)తోపాటు ఎంత భారీగా వాడినా సౌకర్యవంతంగా ఉండేలా పొడవైన 7200 ఎంఏహెచ్ బ్యాటరీ (7,200mAh battery)తో వస్తోంది. బ్యాటరీ బ్యాకప్, గేమింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే వారికి బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. సమర్థవంతమైన పనితీరుతోపాటు సుదీర్ఘ బ్యాటరీ, స్టీరియో స్పీకర్లు ఐపీ68/ఐపఈ 69 ప్రొటెక్షన్.. ఐక్యూ 11ఎక్స్ 5జీ ఫోన్ సొంతం.
ముఖ్యమైన ఫీచర్లు ఇవే
6.76 అంగుళాల ఫుల్ హెచ్డీ + 120 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే (6.76-inch FHD+ 120Hz LCD display)
మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ (MediaTek Dimensity 7400 Turbo processor)
50 ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా (50MP Sony primary camera)
44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్తోపాటు 7200 ఎంఎహెచ్ బ్యాటరీ (7,200mAh battery with 44W fast charging)
ఆండ్రాయిడ్ 16 (Android 16)
పెద్ద బ్యాటరీతోపాటు విశ్వసనీయతకు ఒప్పో కే14ఎక్స్ 5జీ (Oppo K14x 5G)
ప్రతి రోజూ వాడకంతోపాటు పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్ప్లే, విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచిందే ఒప్పో కె14ఎక్స్ 5జీ (Oppo K14x 5G). సాధారణ వాడకం దారులతోపాటు విద్యార్థులకు అవసరమైన లాంగ్ బ్యాటరీ లైఫ్, స్మూత్ స్క్రోలింగ్, స్టోరేజీ విస్తరణ సామర్థ్యం కలిగి ఉన్న ఫోన్ ఇది.
ఇవే కీలక ఫీచర్లు
6.75 అంగుళాల హెచ్డీ + 120 హెర్ట్జ్ డిస్ప్లే (6.75-inch HD+ 120Hz display)
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ (MediaTek Dimensity 6300 chipset)
50 ఎంపీ డ్యుయల్ రేర్ కెమెరా (50MP dual rear camera)
45వాట్ల చార్జింగ్తోపాటు 6500 ఎంఏహెచ్ బ్యాటరీ (6,500mAh battery with 45W charging)
ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్ ఓఎస్15 (Android 15-based ColorOS 15)
క్లీన్ సాఫ్ట్వేర్ అనుభవం, పారదర్శక డిజైన్ లాంగ్వేజ్‌కి మారు పేరు నథింగ్ ఫోన్ 3ఏ లైట్ (Nothing Phone 3a Lite)
పారదర్శక డిజైన్ లాంగ్వేజ్, క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్‌పీరియెన్స్, ఆచరణాత్మక సౌందర్యం, హార్డ్‌వేర్ గల ఫోన్ నథింగ్ ఫోన్ 3ఎ లైట్ (Nothing Phone 3a Lite)
కీలక ఫీచర్లు ఇవే
120 హెర్ట్స్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే 6.77-inch AMOLED display with 120Hz refresh rate). క్లట్టర్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, వైబ్రంట్ అమోలెడ్ డిస్ ప్లే, రిలయబుల్ కెమెరాలతోపాటు సంప్రదాయ స్మార్ట్ ఫోన్ల డిజైన్లకు భిన్నంగా ఉంటుంది.
మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ (MediaTek Dimensity 7300 Pro processor)
50 ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరా విత్ 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ సెన్సర్ (50MP OIS main camera with 8MP ultra-wide sensor)
33 వాట్ల చార్జింగ్‌తో 5000 ఎంఏహచ్ బ్యాటరీ (5,000mAh battery with 33W charging)
నథింగ్ ఓఏస్ 3.5 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 (Nothing OS 3.5 based on Android 15)
మల్టీ మీడియా వాడకం, ఫొటోగ్రఫీ ఎంజాయ్ చేసే వారికి వివో టీ4ఆర్ 5జీ (Vivo T4R 5G)
ఇవీ కీలక ఫీచర్లు
6.77 అంగుళాల కర్వుడ్ అమోలెడ్ డిస్ప్లే (6.77-inch curved AMOLED display)
మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ (MediaTek Dimensity 7400 processor)
50 ఎంపీ ఓఐఎస్ రేర్ కెమరా విత్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా (50MP OIS rear camera and 32MP selfie camera)
5700 ఎంఏహెచ్ బ్యాటరీ (5,700mAh battery)
ఆండ్రాయిడ్ 15 (Android 15)
హై ఫ్రెష్ రేట్ డిస్ప్లేతో రెడ్ మీ 15 5జీ (Redmi 15 5G)
రెడ్మీ 15 5జీ (Redmi 15 5G) ఫోన్లో బ్యాటరీ లైఫ్ అత్యంత ప్రధాన అంశం. హై రీఫ్రెష్ రేట్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో షియోమీ తీసుకొస్తున్న ఫోన్ ఇది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్, స్టొరేజీ విస్తరించుకునే సామర్థ్యం, డొల్బీ ఆట్మోస్ సపోర్ట్, స్ట్రీమింగ్ అండ్ గేమింగ్ కోసం లార్జ్ డిస్ ప్లే కల ఫోన్ ఇది.
ముఖ్యమైన ఫీచర్లు ఇవే
6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ + 144 హెర్ట్జ్ డిస్ ప్లే (6.9-inch FHD+ 144Hz display)
స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్ (Snapdragon 6s Gen 3 processor)
50 ఎంపీ రేర్ కెమెరా (50MP rear camera)
7,000ఎంఏహెచ్ బ్యాటరీ (7,000mAh battery)
హైపర్ ఓఎస్ 2తోపాటు ఆండ్రాయిడ్ 15 (Android 15 with HyperOS 2)
పలు ప్రీమియం ఫీచర్లతో మోటరోలా మోటో జీ96 (Motorola Moto G96)
స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తోపాటు పొలెడ్ డిస్ప్లే, పలు ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ మోటరోలా మోటో జీ96 (Motorola's Moto G96). క్లీన్ సాఫ్ట్వేర్, సామర్థ్యం గల స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే, డిపెండబుల్ కెమెరా సెటప్‌తో వస్తున్న మోస్ట్ బ్యాలెన్స్డ్ స్మార్ట్ ఫోన్ ఇది.
ఇందులో కీలక ఫీచర్లు
144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల కర్వుడ్ పొలెడ్ డిస్ప్లే (6.67-inch curved pOLED display with 144Hz refresh rate)
స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్ (Snapdragon 7s Gen 2 chipset)
50 ఎంపీ ఓఐఎస్ రేర్ కెమెరా (50MP OIS rear camera)
5500 ఎంఏహెచ్ బ్యాటరీ (5,500mAh battery)
ఆండ్రాయిడ్ 15 (Android 15)
మల్టీ మీడియా ఫీచర్లతో పొకో ఎక్స్7 5జీ (POCO X7 5G)
మల్టీ మీడియాకు సంబంధించిన సుసంపన్న ఫీచర్లతో డిజైన్ చేసిన, గేమింగ్ కోసం తీసుకొచ్చిన ఫోన్ పొకో ఎక్స్ 7 5జీ (POCO X7 5G). షార్ప్ అమోలెడ్ డిస్ప్లే, సమర్థవంతమైన గేమింగ్ పెర్ఫార్మెన్స్, స్టీరియోస్పీకర్లు, ఫాస్ట్ స్టోరేజీ ఆప్షన్లతో నిండిన ఫోన్ ఇది.
కీలక ఫీచర్లు ఇవే
6.67 అంగుళాల 1.5కె కర్వుడ్ అమోలెడ్ డిస్ ప్లే (6.67-inch 1.5K curved AMOLED display)
మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఆల్ట్రా ప్రాసెసర్ (MediaTek Dimensity 7300 Ultra processor)
50 ఎంపీ ఓఐఎస్ ట్రిపుల్ రేర్ కెమెరా (50MP OIS triple rear camera)
స్టీరియో స్పీకర్లు (Stereo speakers)
హైపర్ ఓఎస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ (HyperOS based on Android)
బ్యాలెన్స్డ్ హార్డ్‌వేర్ ప్యాకేజీతో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్36 (Samsung Galaxy F36)
సమతుల్యమైన హార్డ్‌వేర్ ప్యాకేజీతోపాటు సుదీర్ఘ సాఫ్ట్వేర్ సపోర్ట్ గల స్మార్ట్ ఫోన్లలో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్36 (Samsung's Galaxy F36) ఒకటి. సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, ఓఐఎస్ కెమెరా, స్టోరేజీ విస్తరణ, ఎకో సిస్టమ్, సాఫ్ట్వేర్ మన్నిక కలిగిన ఫోన్ ఇది.
ఇవే ముఖ్యాంశాలు
ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ (Exynos 1380 processor)
50 ఎంపీ ఓఐఎస్ ట్రిపుల్ రేర్ కెమెరా (50MP OIS triple rear camera)
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ (5,000mAh battery)
వన్ యూఐ 7తోపాటు ఆండ్రాయిడ్ 15 (Android 15 with One UI 7)

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి