5.11.26

Journalist House Sites | ఏమాయెరా బిడ్డ మీ ఇండ్ల జాగా..! ఏనాటికి నీ చేతికొచ్చేనూ..

Journalist House Sites | ఏమాయెరా బిడ్డ

మీ ఇండ్ల జాగా..!

ఏనాటికి నీ చేతికొచ్చేనూ..

నీ క‌ష్టాల‌కు మోక్ష‌మెప్పుడొచ్చేను..!


ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల క‌డ‌గ‌ళ్లు

వెలుగులోకి తెచ్చిన‌వ్‌..

సీఎం, పీఎంలు అంద‌రూ 

నీకు సుప‌రిచిత‌మంటివి కదరా నాన్న..!


ఏమయేరా బిడ్డా 

మీ ఇళ్ళ జాగా..!


పండుగ ప‌బ్బం లేకుండా

ప్ర‌తి రోజూ కొలువుకే పోతుంటివి..!

ఇంట్ల శుభ‌కార్య‌మైనా 

వార్త సేక‌ర‌ణే ముఖ్య‌మంటివి..!


ఏమాయెరా బిడ్డ 

మీ ఇండ్ల జాగా..!

ఏనాటికి మీ చేతికొచ్చేనూ..

నీ క‌ష్టాల‌కు మోక్ష‌మెప్పుడొచ్చేను..!


కాసు బ్ర‌హ్మానందుడు మొద‌లు

మ‌ర్రి చెన్నారెడ్డి.. కోట్ల విజ‌యబాస్క‌రుడి వ‌ర‌కూ..

నాగార్జున స‌ర్కిల్ నుంచి 

గోప‌న్ ప‌ల్లి దాకా..

ద‌ఫ‌ద‌ఫాలుగా 

క‌లం యోధుల‌కు ఇళ్ల స్థ‌లాలిచ్చిర‌ని

మురిసిపోతివి కదరా కొడకా.. 

నాకూ వ‌స్త‌ద‌ని ఆశ ప‌డితివి కదరా బిడ్డా..!


ఏమాయెరా బిడ్డ మీ ఇండ్ల జాగా..!

ఏనాటికి మీ చేతికొచ్చేనూ..

నీ క‌ష్టాల‌కు మోక్ష‌మెప్పుడొచ్చేను..!


పందొమ్మిది వందల తొంబై నాలుగుల ఎన్టీఆర్‌.. 

పందొమ్మిది వందల తొంబై ఐదుల బాబు వ‌చ్చే..

రెండువేల మూడు దాక ఇళ్ల జాగ‌ల‌పై 

బాబు నోరు మెద‌ప‌క పాయే..


ఏమాయేరా బిడ్డా 

మీ ఇళ్ల జాగా.. 


పాద‌యాత్ర చేసి జ‌నం గోడుతోపాటు 

క‌లం యోధుల బాధ‌లు తెలుసుకున్న వైఎస్సార్‌.. 

మీకిస్తా ఇళ్ల స్థ‌లాలు అని  న‌మ్మ బ‌లికే..


ఏమయేరా బిడ్డా 

మీ ఇళ్ల జాగా 


సరిగ్గా పందొమ్మిది వందల తొంబై మూడు తర్వాత ప‌దేళ్ల‌కు

రెండువేల ఎనిమిదిల నిజాంపేట‌, పేట్ బ‌షీరాబాద్‌లో 

ఇచ్చిన స్థలాల‌కు కోర్టుల గ్ర‌హ‌ణం ప‌ట్టె..


ఏమాయేరా బిడ్డా 

మీ ఇళ్ల జాగా 


ఇల్లూ ఇళ్ల స్థ‌లం లేద‌ని అఫిడ‌విట్ వేసి

జాగా తీసుకోమ‌ని హైకోర్టు చెబితే..

సర్కారు సుప్రీంకోర్టు మెట్లెక్కే..

స‌ర్కారుతోపాటే మ‌న‌మూ బోతిమి కదరా కొడకా..


ఏమాయేరా బిడ్డా 

మీ ఇళ్ల జాగా 


నడిమిట్ల రెండువేల పదకొండులో జాగాకు 

డ‌బ్బు క‌ట్ట‌మంటే నీ బాధ‌లు చెప్ప‌న‌ల‌వి 

కాదాయె కదరా బిడ్డా..


ఏమాయేరా బిడ్డా 

మీ ఇళ్ల జాగా 


తండ్రి నుంచి వ‌చ్చిన నాలుగైదు ఎక‌రాలు..

సొంతంగా కొనుక్కున్న జాగాలూ 

తెగ‌న‌మ్మిన‌వ్ క‌ద‌రా బిడ్డా..

అవి స‌రిపోక పోతే ఆలి తాళి

తాక‌ట్టు బెడితివి కదరా.. 

అయినా మిగ్లా కావాలంటే 

తెగ న‌మ్మితివి కదరా కొడకా..


కాదుకూదూ అంటే బారు వ‌డ్డీకి

రెండు ల‌క్ష‌లు తెచ్చి క‌డితివి కదరా..

ఆ అప్పుకు వ‌డ్డీ అస‌లు క‌ట్ట‌లేక‌

నువ్ బ‌డ్డ బాధ‌లు చెప్ప‌న‌ల‌వి

కాకపాయే కదరా బిడ్డా..

దీనికి తోడు పిల్ల‌ల ఫీజులు క‌ట్టుడు..

రోజువారీ గాసం గ‌డవ‌క 

పిల్ల‌ల పెన్ను పుస్త‌కాలు కొనేందుకు 

పైస‌ల్లేక నీ బాధ‌లు ఎవ‌రిక‌ని చెబుత‌వ్‌రా బిడ్డా..


ఏమాయెరా బిడ్డ నీ ఇండ్ల జాగా..!

ఏనాటికి నీ చేతికొచ్చేనూ..

నీ క‌ష్టాల‌కు మోక్ష‌మెప్పుడొచ్చేను..!


చూస్త చూస్త ఇరవై ఏళ్లు 

గ‌డిచిపాయె కదరా..

నిర్ణ‌యించిన డ‌బ్బు క‌ట్టినా

ఇళ్ల జాగ‌ నీ చేతికి రాక‌పాయె..


ఏమాయేరా బిడ్డా 

మీ ఇళ్ల జాగా..


స‌ర్కారు కొలువు లెక్క రిటైరైతే

పెన్ష‌న్ ఫీఎఫ్‌లు లేక‌పాయె

ఆడ‌పిల్ల‌ పెండ్లెట్ల జేస్త‌వ్ రా మీబిడ్డా..

కొడుక్కి ఏమి మిగులుస్త‌వ్‌రా నాన్నా..


ఏమాయెరా బిడ్డ 

నీ ఇండ్ల జాగా..!

ఏనాటికి నీ చేతికొచ్చేనూ..

నీ క‌ష్టాల‌కు మోక్ష‌మెప్పుడొచ్చేను..!



#TEAM JNJ #JNJHS #HOUSE SITES #HYDERABAD  #JOURNALISTS

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి