18.11.24

Home Loan-Insentives | కొత్త‌గా హోమ్ లోన్ తీసుకునే వారికి ల‌భించే టాక్స్ ఇన్సెంటివ్‌లు ఇవే..!



Home Loan-Insentives | మీకూ అంద‌రి మాదిరిగానే సొంతింటి క‌ల సాకారం చేసుకోవాల‌ని ఉంది క‌దా.. అయితే అందుకు స‌రిప‌డా పెట్టుబ‌డి కావాలిగా.. దీని కోసం ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. మార్కెట్‌లో సొంతింటి క‌ల‌కు గ‌ల డిమాండ్‌ను ప్రోత్స‌హించేందుకు ప‌లు బ్యాంకులు హోమ్ లోన్ల‌పై వ‌డ్డీరేట్లు త‌గ్గిస్తున్నాయి. త‌న ఖాతాదారుల‌కు ఇంటి రుణాల‌పై హౌసింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ 5 బేసిక్ పాయింట్ల రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్‌) త‌గ్గించింది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్‌, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ కూడా ఇంటి రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించేశాయి.

అయితే, హోమ్ లోన్ల‌పై వ‌డ్డీరేట్ల త‌గ్గింపు కొత్త రుణ గ్ర‌హీత‌ల‌కే వ‌ర్తిస్తుంద‌ని ప‌ర్స‌న‌ల్ ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు. గ‌తంలో హోమ్ లోన్‌ తీసుకున్న రుణ గ్ర‌హీత‌ల‌కు ఈ బెనిఫిట్లు ల‌భించ‌బోవ‌ని అంటున్నారు. ఒక‌వేళ భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెపొరేట్ త‌గ్గిస్తే మాత్రం పాత రుణ గ్ర‌హీత‌ల‌కు కూడా ల‌బ్ధి చేకూరుతుందంటున్నారు.

ఇంటి కొనుగోలుకు గానీ, ఇంటి నిర్మాణానికి తీసుకున్న తీసుకున్న ఇంటి రుణం మొత్తంలో రూ.1.5 ల‌క్ష‌లకు ఐటీ చ‌ట్టంలోని 80సీ కింద మిన‌హాయింపు ఉంటుంది. ఒక‌వేళ కొనుగోలు చేసిన ఐదేండ్ల‌లో ఇల్లు అమ్మేస్తే మిన‌హాయించిన‌ పన్ను చెల్లించాలి. ఆస్తి బ‌దిలీకి సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ చార్జీలు, ఇత‌ర ఖ‌ర్చుల‌పై తొలి ఏడాదిలో రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు 80సీ కింద మిన‌హాయింపునిస్తారు.

ఆదాయం ప‌న్ను చ‌ట్టంలో 24 (బీ) సెక్ష‌న్ కింద ప్ర‌తి ప‌న్ను చెల్లింపు దారు తాను చెల్లించే ఇంటిరుణ వాయిదాల్లో రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు కోర‌తారు. ఇది ఇంటి నిర్మాణం పూర్త‌య్యాకే ఆ రుణ గ్ర‌హీత‌కు వ‌ర్తిస్తుంది.

కొత్త‌గా ఐటీ మిన‌హాయింపుల‌ను విస్త‌రిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం 2017-18లో ఐటీ చ‌ట్టంలో 80ఈఈ సెక్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని కింద రూ.50 వేల రుణంపై వ‌డ్డీ చెల్లింపుల‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అందుకు అమ‌లులో ఉన్న ష‌ర‌తులు ఇవే:

2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆర్థిక సంస్థ‌/ బ‌్యాంక్ మంజూరు చేసిన రుణ‌మై ఉండాలి.

స‌ద‌రు రుణం రూ.35 ల‌క్ష‌ల‌కు త‌క్కువ‌గా ఉండ‌కూడదు.

ఆస్తి విలువ రూ.50 ల‌క్ష‌లు దాటొద్దు.

ఇంటి రుణం పొందే నాటికి స‌ద‌రు వ్య‌క్తి తొలిసారి ఇంటి య‌జ‌మాని అయి ఉండాలి.

ఈ సెక్ష‌న్ కింద డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకున్న వారికి రుణ వాయిదాల్లో వ‌డ్డీ చెల్లింపుపై ఇత‌ర సెక్ష‌న్ల కింద క్లెయిమ్ చేయ‌డానికి అనుమ‌తించ‌రు.


రుణ వాయిదాల చెల్లింపు పూర్త‌య్యే వ‌ర‌కు ఐటీ చ‌ట్టంలోని 80ఈఈ సెక్ష‌న్ కింద వ‌డ్డీపై ప‌న్ను రాయితీ ల‌భించినా.. పైన పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉండాలి. 80ఈఈ సెక్ష‌న్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి రుణం తీసుకున్న వారికి రుణ వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.
కొత్త‌గా 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేంద్రం 80ఈఈఏ సెక్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. త‌క్కువ వ్య‌యంతో ఇంటి నిర్మాణం చేప‌ట్టిన వారికి ప‌న్ను మిన‌హాయింపులు క‌ల్పించేందుకు ఈ సెక్ష‌న్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సెక్ష‌న్ కింద అద‌నంగా రూ.1.5 ల‌క్ష‌లకు వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపున‌కు అమ‌లు చేయాల్సిన నిబంధ‌న‌లు ఇవే:

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2021 మార్చి 31 వ‌ర‌కు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్న వ్య‌క్తుల‌కు ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

ఆస్తి విలువ రూ.45 ల‌క్ష‌లు దాటొద్దు.

ప‌న్ను చెల్లింపు దారుడు తొలిసారి రుణం తీసుకున్న వ్య‌క్తి అయి ఉండాలి.

ఐటీ చ‌ట్టంలోని 80ఈఈ సెక్ష‌న్ కింద డిడ‌క్ష‌న్ పొందిన వారికి మిన‌హాయింపు ఉండ‌దు.

ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గ‌తేడాది న‌వంబ‌ర్ 12వ తేదీన ఇండ్ల డెవ‌ల‌ప‌ర్లు, కొనుగోలు దారుల‌కు రిలీఫ్‌నిచ్చే చ‌ర్యను తీసుకున్నారు. దేశంలో రెసిడెన్షియ‌ల్ రియ‌ల్ ఎస్టేట్ లావాదేవీల‌కు డిమాండ్‌ను పెంపొందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. తొలిసారి రూ.2 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసి ఇల్లు కొనుగోలు చేసిన వారు ఈ ప‌థ‌కం కింద మిన‌హాయింపు కోరొచ్చు. వీరికి 20 శాతం వ‌ర‌కు ఆదాయంప‌న్ను రాయితీ వ‌చ్చే జూన్ 30 వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది.

future-reliance | ఫ్యూచ‌ర్-రిల‌య‌న్స్ డీల్‌: లీగ‌ల్‌గా అమెజాన్ నిలుస్తుందా?!

 First Published on June 22, 2021 / 10:16 PM IST



future-reliance | దేశీయ రిటైల్ రంగంలో ఆధిప‌త్యం కోసం అటు గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌.. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సార‌ధ్యంలోని రిల‌య‌న్స్ రిటైల్ పోటీ ప‌డుతున్నాయి. రిటైల్ మార్కెట్‌పై ప‌ట్టు సాధించ‌డానికి రిల‌య‌న్స్ రిటైల్ అన్ని ఆప్ష‌న్ల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ది. ఇప్ప‌టికే అతిపెద్ద దేశీయ రిటైల్ నెట్‌వ‌ర్క్‌గా భావిస్తున్న ఫ్యూచ‌ర్ రిటైల్ గ్రూప్‌.. అప్పుల ఊబిలో చిక్కుకున్న‌ది.

అప్పులు+క‌రోనాతో ప్యూచ‌ర్ కుదేలు

అప్పుల భారానికి తోడు గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి విసిరిన పంజాతో ఫ్యూచ‌ర్ బిజినెస్ దెబ్బ తిన్న‌ది. ఈ క్ర‌మంలో ఫ్యూచ‌ర్ గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి సారించారు. స‌హ‌జంగానే రిటైల్ మార్కెట్‌లోనూ కీల‌క పాత్ర పోషించాల‌ని ఉవ్విళ్లూరుతున్న రిల‌య‌న్స్ రిటైల్ దీన్ని త‌న‌కు సానుకూలంగా మార్చుకున్న‌ది. మొత్తం ఫ్యూచ‌ర్ రిటైల్ గ్రూప్‌ను త‌మ సంస్థ‌లో విలీనానికి పావులు క‌దిపింది. త‌ద‌నుగుణంగా ఫ్యూచ‌ర్‌-రిల‌య‌న్స్ మ‌ధ్య రూ.24,713 కోట్ల ఒప్పందం కుదిరింది.

రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ డీల్‌పై భ‌గ్గుమ‌న్న అమెజాన్

రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డంతో ఎప్ప‌టి నుంచో భార‌త రిటైల్ మార్కెట్‌పై క‌న్నేసిన అమెజాన్ భ‌గ్గుమ‌న్న‌ది. దీనికీ ఓ కార‌ణం ఉంది. ఇంత‌కు ముందే ఫ్యూచ‌ర్ రిటైల్ అనుబంధ ఫ్యూచ‌ర్ కూప‌న్స్‌లో రూ.1500 కోట్ల విలువైన 49 శాతం వాటాల‌ను అమెజాన్‌ కొనుగోలు చేయ‌డ‌మే. ఒక‌వేళ చ‌ట్టాలు అనుమ‌తి ఇస్తే, మూడేండ్ల నుంచి 10 ఏండ్ల మ‌ధ్య ఫ్యూచ‌ర్ రిటైల్ ఆస్తుల‌ను అమెజాన్‌కు మాత్ర‌మే విక్ర‌యించే హ‌క్కు క‌ల్పిస్తూ రెండు సంస్థ‌ల మ‌ధ్య 2019 ఆగ‌స్టులో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి నియంత్ర‌ణ సంస్థ‌ల్లో ఒక‌టైన కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 2019 న‌వంబ‌ర్‌లో ఆమోద‌ముద్ర వేసింది కూడా..

అమెజాన్ పెట్టుబ‌డులు ఎఫ్‌డీఏ ఉల్లంఘ‌నేనా!

దేశీయ రిటైల్ సంస్థ‌లు ఫ్యూచ‌ర్ రిటైల్ లిమిటెడ్‌, ఫ్యూచ‌ర్ కూప‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, రిల‌య‌న్స్ రిటైల్ మాత్రం అమెజాన్ వాద‌న నిల‌బ‌డద‌ని చెబుతున్నాయి. ఫ్యూచ‌ర్ కూప‌న్స్ ద్వారా ఫ్యూచ‌ర్ రిటైల్ లిమిటెడ్‌లో ప‌రోక్షంగా అమెజాన్ పెట్టుబ‌డులు పెట్టింద‌ని, ఇది విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌న్నాయి. మ‌ల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి కేవ‌లం 10 శాతం విదేశీ పెట్టుబ‌డుల‌ను మాత్ర‌మే అనుమ‌తినిస్తున్నాయ‌ని పేర్కొంటున్నాయి.

అమెజాన్ ఇలా న్యాయ‌పోరాటం

గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జంగా అమెజాన్‌.. ఫ్యూచ‌ర్‌-రిల‌య‌న్స్ ఒప్పందాన్ని సింగ‌పూర్ అంత‌ర్జాతీయ మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టులో స‌వాల్ చేసింది. అమెజాన్ పిటిష‌న్‌ను విచారించిన అంత‌ర్జాతీయ మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టు.. ఫ్యూచ‌ర్‌-రిటైల్ ఒప్పందాన్ని త‌ప్పుబ‌ట్టింది. కానీ ఫ్యూచ‌ర్ చ‌క‌చ‌కా రిల‌య‌న్స్‌లో విలీనానికి పావులు క‌దిపింది. ఫ‌లితంగా ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ అమెజాన్ పిటిష‌న్లు వేసింది. రిల‌య‌న్స్ రిటైల్‌లో త‌మ సంస్థ విలీనాన్ని అడ్డుకోవ‌ద్దంటూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు ఫ్యూచ‌ర్ గ్రూప్ ఉద్యోగులు బ‌హిరంగ లేఖ కూడా రాశారు.


ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

 First Published on March 28, 2021 / 08:37 PM IST

న్యూఢిల్లీ: ప్ర‌తి ఒక్క‌రికి సొంతింటి నిర్మాణం ఓ క‌ల‌.. దాన్ని సాకారం చేసుకోవాలంటే ప‌లు స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక సీనియ‌ర్ సిటిజ‌న్లు ఒక సొంతిల్లు కొనుక్కోవాలంటే ఒక స‌వాల్. సొంత గూడు కావాలంటే ఈనాడు ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డి పెట్టాలి. ఇంటి కొనుగోలు వంటి భారీ ప్రాజెక్టుల‌కు బ్యాంకులు కూడా రుణాలిస్తాయి.. అది సంబంధిత వ్య‌క్తికి స్థిర‌మైన ఉద్యోగం, రెగ్యుల‌ర్ ఇన్‌కం ఉన్న యువ‌కుల‌కు ఇంటి రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి సానుకూల అంశాలు..

పెన్ష‌న్ ఆధార సీనియ‌ర్ల‌కు రుణాలిలా..

కానీ సీనియ‌ర్ సిటిజ‌న్లు లేదా రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తిగా పెన్ష‌న్ ఆధారిత ఆదాయ‌మే జీవ‌నాధారం. ఈ ప‌రిస్థితుల్లో ఇంటి రుణానికి అవ‌స‌ర‌మైన అర్హ‌త‌లు వారు స‌మ‌కూర్చుకోవాలంటే ఒకింత క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తూ ఉంటుంది. బ్యాంక‌ర్లు లేదా ఆర్థిక సంస్థ‌లు కూడా 70 ఏండ్ల వ‌య‌స్సు వ‌ర‌కు మాత్ర‌మే గ‌రిష్ఠంగా రుణ ప‌రిమితి (లోన్ టెన్యూర్‌)ని అనుమ‌తిస్తాయి.

ఈఎంఐ పెంపు.. రుణం త‌గ్గింపు..

ఒక‌వేళ మీరు 60 ఏండ్ల పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్ అయితే, ఏదేనీ బ్యాంక‌ర్ గ‌రిష్ఠంగా ఇంటి రుణం చెల్లింపున‌కు 10 ఏండ్ల వ‌ర‌కూ మాత్ర‌మే గ‌డువు ఇస్తారు. అతి త‌క్కువ రుణ వాయిదాల చెల్లింపు పీరియ‌డ్ వ‌ల్ల రుణ గ్ర‌హీత త‌న రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపును పెంచుకోవ‌డం లేదా.. రుణం త‌గ్గించుకోవ‌డం గానీ చేస్తారు.

ప‌రిమితుల‌పై అవ‌గాహ‌న‌తోనే రుణం ల‌భ్య‌త ఈజీ

అర్హ‌త‌ల ప్ర‌మాణాల‌ను పూర్తి చేసేందుకు సిద్ద‌మైనా.. త‌మకు ఉన్న ప‌రిమితుల‌ను తెలుసుకుంటే త‌ప్ప సీనియ‌ర్ సిటిజ‌న్లకు ఇంటి రుణం ల‌భించ‌డం అంత తేలిక్కాదు. క‌నుక సీనియ‌ర్ సిటిజ‌న్లు రుణంపై ఇల్లు కొనుక్కోవాల‌నుకుంటే మాత్రం కొన్ని కీల‌క అంశాలు తెలుసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

వీరికి 10 ఏండ్లే పేమెంట్ పీరియ‌డ్

సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇంటి రుణం కోసం దర‌ఖాస్తు చేసుకోవాలంటే త‌మ వ‌య‌స్సును బ‌ట్టి ప‌దేండ్ల త‌క్కువ పేమెంట్ పీరియ‌డ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 40 ఏండ్ల వ‌య‌స్సు గ‌ల రుణ గ్ర‌హీత‌కు 70 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు గ‌రిష్ఠంగా 30 ఏండ్ల వ‌ర‌కు రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లించ‌డానికి ఆస్కార‌ముంటుంది.

30 ఏండ్ల‌లోపే ఈఎంఐ గ‌డువు..

సీనియ‌ర్ సిటిజ‌న్ల విష‌యానికి వ‌స్తే ఈఎంఐ చెల్లింపుల గ‌డువు 30 ఏండ్ల లోపు ఉంటుంది. తక్కువ గ‌డువులో రుణం చెల్లించాల్సి వ‌స్తే ఈఎంఐ సైజ్ పెరిగుతుంది. క‌నుక సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌మ‌కు ఎంత రుణం అవ‌స‌ర‌మో జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యించుకోవాలి. త‌క్కువ రుణ నిష్ప‌త్తిని ఎంచుకుంటే స‌ద‌రు వ్య‌క్తి దాఖ‌లు చేసిన ఇంటి రుణం ద‌ర‌ఖాస్తును బ్యాంక‌ర్లు ఆమోదిస్తారు.

ఎల్టీఎంతో త‌క్కువ ఈఎంఐ ఖ‌రారు

త‌క్కువ లోన్ టెన్యూర్ వాల్యూ (ఎల్టీఎం) అంటే త‌క్కువ ఈఎంఐ ఖ‌రార‌వుతుంది. ఇటువంటి వారికే ఒక బ్యాంక‌ర్ నుంచి ఇంటి రుణ ద‌ర‌ఖాస్తుకు ఆమోద‌ముద్ర ల‌భిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ సొంత ఆదాయ వ‌న‌రుల నుంచి ఇంటి విలువ చెల్లింపున‌కు మొగ్గితే, త‌క్కువ రుణం బ్యాంక్ నుంచి ల‌భిస్తుంది.

ఎమ‌ర్జెన్సీ ఫండ్‌పై రాజీ ప‌డొద్దు

క‌నుక త‌గినంత ఎమ‌ర్జెన్సీ ఫండ్ నిర్వ‌హించుకోవ‌డం వంటి అంశాల‌పై సీనియ‌ర్ సిటిజ‌న్లు రాజీ ప‌డొద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌త్యేకించి త‌క్కువ విలువ గ‌ల ఆస్తి కొనుగోలుకు మొగ్గు చూపితే వారిపై నెల‌వారీ రుణ వాయిదా (ఈఎంఐ) భారం త‌గ్గుతుంది.

కుటుంబ స‌భ్యుల కో-అప్లికెంట్‌తో ప్ర‌యోజ‌నాలివి..

త‌క్కువ రీపేమెంట్ టెన్యూర్ వ‌ల్ల చాలా మంది సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇంటి రుణం కోసం బ్యాంక‌ర్ల నిబంధ‌న‌ల‌ను పూర్తి చేయ‌డం క‌ష్ట సాధ్యం అ‌వుతుంది. ఈ త‌రుణంలో ఇంటి రుణ అర్హ‌త‌ల‌ను సంపాదించుకోవాలంటే వారు త‌మ‌తోపాటు కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిని స‌హ రుణ ద‌ర‌ఖాస్తు దారుగా చేర్చాలి.అలా కుటుంబ స‌భ్యుల‌ను కో-అప్లికెంట్‌గా చేర్చ‌డంతో ఇంటి రుణం పొంద‌డానికి మార్గాలు మెరుగ‌వుతాయి. అలాగే తీసుకునే రుణం విలువ కూడా పెరుగుతుంది.

పాత రుణాలు క్లియ‌ర్ చేసుకుంటే ఇలా ఈజీ

సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇంటి రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ముందే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రుణాల చెల్లింపులు పూర్తిగా క్లియ‌ర్ చేసుకోవ‌డం ఉత్త‌మంగా ఉంటుంది. ఇత‌ర రుణాలు తీసుకుని ఉంటే, బ్యాంక‌ర్ మీ రీపేమెంట్ కెపాసిటీని చెక్ చేస్తారు.

రుణ వాయిదాల పెరుగుద‌ల‌తో స‌మ‌స్య‌లిలా

అప్ప‌టికే తీసుకున్న రుణాల‌కు వాయిదాలు చెల్లిస్తుండ‌టం వ‌ల్ల సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ నెల‌వారీ ఆదాయం త‌గ్గిపోతుంది. ఒక‌టి, రెండు రుణ వాయిదాలు ఉన్నా.. ఇంటి రుణం అర్హ‌త త‌గ్గుతుంది. ఇప్ప‌టికే ఉన్న రుణ చెల్లింపులు పూర్తి చేసుకుంటే.. మీ ఇంటిరుణ అర్హ‌త‌లు మెరుగ‌వుతాయి.

మంచి క్రెడిట్ స్కోర్ మెయింటెన్ చేయాలిలా

ఇంటి రుణం తీసుకోవాలంటే గుడ్ క్రెడిట్ స్కోర్ కొన‌సాగించ‌డం కీల‌కంగా మారుతుంది. ఒక‌వేళ చాలా త‌క్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌రించ‌డ‌మో, అధిక వ‌డ్డీరేటు ఖ‌రారు చేయ‌డానికో బ్యాంక‌ర్లు ప్రాధాన్యం ఇస్తుంటారు. క‌నుక ఇంటి రుణం తీసుకోవాల‌ని అభిల‌షించే వారు త‌మ క్రెడిట్ స్కోర్ 750 పాయింట్ల పై చిలుకు ఉండేలా చూసుకోవాలి.

నిర్మాణం పూర్త‌యిన ఇంటినే కొనుక్కోవాలి

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే, ఇంటి రుణ వాయిదాతోపాటు అద్దె చెల్లింపులు స‌మ‌స్య‌గా మార‌తాయి. స‌కాలంలో బిల్డ‌ర్ ఇంటిని మీకు అప్ప‌గించ‌క‌పోతే మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి వ‌స్తుంది. క‌నుక అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్న ఇంటి కొనుగోలుకే సీనియ‌ర్ సిటిజ‌న్లు ప్రాధాన్యం ఇవ్వ‌డం మంచిద‌ని బ్యాంక‌ర్లు సూచిస్తున్నారు. యోగా సెంట‌ర్లు, మెడిక‌ల్ ఫెసిలిటీ, రోడ్డు, బ‌స్టాప్, మెట్రో స్టేష‌న్ల‌కు స‌మీపంలోని ఇండ్ల కొనుగోలుకు మొగ్గు చూపితే బెట‌ర్ అన్న అభిప్రాయం వినిపిస్తున్న‌ది.

స‌వాళ్లు ఉన్నా ఆర్థిక ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాలి

స‌వాళ్లు ఎదురైనా సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాలంటే సీనియ‌ర్ సిటిజ‌న్లు స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకోవాలి. ఇల్లు కొనుగోలుకు త‌మ రిటైర్మెంట్ కార్ఫ‌స్ ఫండ్ ఎంత వ‌స్తుంద‌న్న విష‌య‌మై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంటే రోజువారీ అవ‌స‌రాలతోపాటు అత్య‌వ‌స‌రాల‌పై ప్ర‌భావం ప‌డ‌ద‌ని బ్యాంక‌ర్లు, నిపుణులు అంటున్నారు.


gold vs crypto currency | బంగారం vs క్రిప్టో క‌రెన్సీ.. పెట్టుబ‌డికి ఏది బెస్ట్‌? గోల్డ్‌కే ఇండియ‌న్ల మొగ్గు!!

First Published May 16, 2021 / 10:53 PM IST



gold vs crypto currency | బంగారం వంటే భార‌తీయ మ‌హిళ‌ల‌కు ఎంతో ప్రీతి.. అక్ష‌య తృతీయ.. ధంతేరాస్ వంటి ప‌ర్వ దినాల్లో ప్ర‌తి ఒక్క‌రూ బంగారం కొనుగోలు చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఈ ఏడాది అక్ష‌య తృతీయ టైమ్‌లో బంగారం కొనుగోలు చేయాలా? క్రిప్టో క‌రెన్సీ కొనుగోలు చేయాలా? అన్న విష‌య‌మై ఇన్వెస్ట‌ర్లు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు.

గ‌త కొన్ని నెల‌లుగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రిప్టో క‌రెన్సీలు బిట్ కాయిన్‌, డోజ్ కాయిన్ దూకుడుగా దూసుకెళ్తున్నాయి. మిలియ‌నిల్స్ ద్రుష్టిని ఆకర్షిస్తున్నాయి. భార‌తీయ ఇన్వెస్ట‌ర్లు కూడా ఇందులో జ‌త క‌లిశారు. కాక‌పోతే క్రిప్టో క‌రెన్సీ విలువ మాత్రం అనిశ్చితికి గుర‌వుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం.

బంగారం మాత్రం ఒడిదొడుకుల‌కు గుర‌వుతున్న‌ది. బంగారం మాదిరిగానే స్టోర్‌-ఆఫ్‌-వాల్వు ఇన్వెస్ట్‌మెంట్ బిట్ కాయిన్ నిలిచింది. క‌రెన్సీ డీ వాల్యూయేష‌న్, అనిశ్చితికి వ్య‌తిరేకంగా పెట్టుబ‌డికి మార్గంగా బిట్ కాయిన్ నిలుస్తున్న‌ది కానీ అనిశ్చితికి గుర‌వుతున్న‌ద‌ని క్రిప్టో క‌రెన్సీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బంగారానికి ఉన్న డిమాండ్‌, దానిప‌ట్ల స‌మ్మోహ‌నం ఏమాత్రం త‌గ్గ‌వ‌ని ఐఐఎఫ్ఎల్ సెక్యూర‌టీస్ క‌మొడిటీస్ అండ్ క‌రెన్సీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా చెప్పారు. ఏడాది కాలంలో రెండంకెల రిట‌ర్న్స్ ల‌భించాయ‌న్నారు.

అమెరికా డాల‌ర్‌తో ఇటు బంగారం.. అటు బిట్ కాయిన్ ప‌ర‌స్ప‌ర విలోమ సంబంధం సంబంధం ఉంద‌ని అనూజ్ గుప్తా అంగీక‌రించారు. డాల‌ర్‌కు వ్య‌తిరేకంగా బిట్ కాయిన్‌, బంగారం త‌రుచుగా పైచేయి సాధిస్తూనే ఉన్నాయ‌న్నారు. బిట్ కాయిన్‌.. డిజిట‌ల్ గోల్డ్ అవ‌తారమెత్తింద‌ని కొంద‌రు ఇన్వెస్ట‌ర్లు పేర్లు కూడా పెట్టారు.

మిలియ‌నిల్స్‌, టెక్నాల‌జీసిస్ట్‌లు మిన‌హా ప‌దేండ్ల క్రితం వెలుగులోకి వ‌చ్చిన క్రిప్టో క‌రెన్సీకి భ‌విష్య‌త్ లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇండియ‌న్ ఇన్వెస్ట‌ర్ల విష‌యానికి వ‌స్తే ప‌సిడి మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఫ‌స్ట్ చాయిస్‌గా నిలుస్తుంద‌ని క్యాపిట‌ల్ వ‌యా గ్లోబ‌ల్ రీసెర్చ్ క‌మోడిటీస్ అండ్ క‌రెన్సీ అధినేత క్షితిజ్ పురోహిత్ వ్యాఖ్యానించారు.

భార‌తీయ ఇన్వెస్ట‌ర్లు సుదీర్ఘ‌కాలంగా జ్యువెల్ల‌రీస్‌, బంగారంపై పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్యం ఇచ్చార‌ని క్షితిజ్ పురోహిత్ చెప్పారు. బంగారంతో పోలిస్తే క్రిప్టో క‌రెన్సీల‌కు భార‌త దేశంలో విస్త్రుత స్థాయిలో ఆమోదం ల‌భించ‌లేద‌న్నారు. క్రిప్టో క‌రెన్సీల నిర్వ‌హ‌ణ, నిబంధ‌న‌ల ప‌ట్ల క్లారిటీ లోపించింద‌ని తెలిపారు.

క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ బీటెక్స్ సీఈఓ మోనార్క్ మోదీ మాట్లాడుతూ వ‌ర్చువ‌ల్ క‌రెన్సీలో పెట్టుబడులు పెట్ట‌డానికి ముందు ఒక‌టికి రెండుసార్లు త‌ప్ప‌నిస‌రిగా త‌నిఖీ చేసుకోవాల‌ని సూచించారు. సంబంధిత క్రిప్టో క‌రెన్సీ ల‌క్ష్యాన్ని సాధించే ముందు దాని విజ‌న్ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్నారు.

గ‌త 50 ఏండ్ల‌లో బంగారం ధ‌ర‌లు స్ఫూర్తిదాయ‌క రీతిలో పెరిగాయి. దాంతో పోలిస్తే బిట్ కాయిన్ 2008లో మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత‌ గ‌త ద‌శాబ్ద కాలంలోనే 0.08 డాల‌ర్ల స్థాయి నుంచి ఇటీవ‌లే 60 వేల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. క్రిప్టో క‌రెన్సీల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల మెరుగైన రిట‌ర్న్స్ ఉన్నా.. అనిశ్చితి వెంటాడుతున్న‌ద‌ని క్షితిజ్ పురోహిత్ చెప్పారు.

బంగారం వ‌ద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మ‌హిళ‌ల మ‌నోగ‌తం!

 First Published March 3, 2021 / 09:49 PM IST

న్యూఢిల్లీ: మ‌హిళ‌ల‌కు బంగారం అంటే ఎంతో ఇష్టం.. త‌మ ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంటే.. ఆభ‌ర‌ణాల కొనుగోళ్ల‌కే మొగ్గు చూపుతారు.. కానీ ప్ర‌‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి వారిలో భారీగానే మార్పులు తెచ్చింది. క‌రోనా అనంతర ప‌రిస్థితుల్లో 70 శాతం మంది మ‌హిళ‌లు బంగారం కంటే ఇండ్లు,, ఇండ్ల స్థలాల కొనుగోళ్ల‌కు, స్థిరాస్తుల కొనుగోళ్ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఓ స‌ర్వేలో తేలింది. బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్ కంటే ఆస్తి కొనుగోలుకే అత్య‌ధిక మ‌హిళా మ‌ణులు మొగ్గు చూపుతున్నార‌ని రియ‌ల్ ఎస్టేట్ క‌న్స‌ల్టెంట్ అన‌రాక్ నిర్వ‌హించిన స‌ర్వేలో నిర్దార‌ణ అయ్యింది.

దాదాపు 62 శాతం మంది మ‌హిళ‌లు త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బును రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 82 శాతం మంది మ‌హిళ‌లు ఇల్లు కొనుగోలు కోసం.. 18 శాతం పెట్టుబ‌డిగా ఇల్లు కొనుగోలుకు మొగ్గుతున్నారు.

54 శాతం మంది పురుషులు మాత్రం గోల్డ్‌, స్టాక్స్‌లో పెట్టుబ‌డులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డుల‌కు ఆస‌క్తి చూపుతున్నారు. క‌నీసం 68 శాతం మంది పురుషులు ఇండ్ల కొనుగోలు, 34 శాతం మంది పెట్టుబ‌డి రూపేణా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.
70 శాతం మంది మ‌హిళ‌లు ఆస్తి కొనుగోలుకు ఇది స‌రైన స‌మ‌యం అని భావిస్తుంటే.. 66 శాతం మంది రూ.90 ల‌క్ష‌ల్లోపు చౌక‌ధ‌ర‌కు వ‌చ్చే ఇండ్ల కొనుగోలు కోసం ముందుకెళ్లాల‌ని అంటున్నారు.

బిగ్ ఫార్మాట్ ఇండ్ల కోసం మ‌హిళ‌లు ప‌ట్టుబ‌డుతుండ‌గా, 46 శాతం మంది త్రిబుల్ బెడ్‌రూమ్ ప్లాట్లు, 30 శాతం మంది డ‌బుల్ బెడ్‌రూమ్ ఇల్లు, 10 శాతం మంది ఫోర్ బెడ్‌రూమ్స్ ఇండ్ల‌వైపు మొగ్గుతున్నారు. స్థిరాస్తుల‌కు భ‌ద్ర‌త ప‌ట్ల ప్రాధాన్యం ఇస్తున్న మ‌హిళ‌లు 31 శాతం మంది చౌక ఇండ్ల రుణాలు తీసుకోవ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. 28 శాతం మంది డెవ‌ల‌ప‌ర్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల‌వైపు మొగ్గుతుంటే, 22 శాతం మంది త‌మ ప్రాధాన్యాల‌కు అనుగుణంగా ఇండ్లు ఉండాల‌ని ఆశిస్తున్నారు.
43 శాతం మంది మ‌హిళ‌లు, పురుషులు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబ‌డుల‌కు మొగ్గుతుంటే.. 21 శాతం మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 20 శాతం మంది స్టాక్స్‌లో పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.