`ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 30 శాతానికి మించి రుణాలు తీసుకోవడాన్ని నివారించమని మేం చెబుతాం. అధిక రుణ వినియోగం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బ తీస్తుంది.మీరు ప్రతి నెలా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. మీ సిబిల్ స్కోర్ 900 ఉంటే పర్‌ఫెక్ట్ స్కోర్ అది ` అని బ్యాంకు బజార్ సీఈఓ అదిల్ శెట్టి తెలిపారు.
cibil score | మీరు హోం లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా..! ఇప్పటికే గృహ రుణం కోసం బ్యాంకర్‌ని
సంప్రదించారా..! అయితే.. ఏ బ్యాంకరైనా సరే మీకు రుణం ఇవ్వాలంటే ముందుగా మీ సిబిల్
స్కోర్ మెరుగ్గా ఉందా..?! లేదా..?! అని చెక్ చేస్తారు. క్రెడిట్ (సిబిల్) స్కోర్ చెక్
చేసుకోవడానికి సంబంధిత మీ పాన్ కార్డు డిటైల్స్ అప్‌లోడ్ చేస్తే.. సిబిల్ స్కోర్ ఎంతుందో
తెలిసిపోతుంది. సిబిల్ స్కోర్ మీ ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుంది. ఇంతకు
ముందు మీరు తీసుకున్న రుణ బకాయి చెల్లింపులను బట్టి సిబిల్ స్కోర్ కొనసాగుతుంది.
ఉదాహరణకు ఒక నెల క్రెడిట్ కార్డు బిల్లు గానీ, పర్సనల్ లోన్ వాయిదా చెల్లించక
పోయినా మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.
క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి..?
క్రెడిట్ కార్డు
బిల్లు, రుణ నెలసరి వాయిదా (ఈఎంఐ) చెల్లింపు మిస్ అయినా, ఆలస్యంగా చెల్లించినా మీ
క్రెడిట్ రిపోర్టులో ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో మీరు రుణం తీసుకోవాలనుకున్నా..,
క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్నా.. ఇటువంటి పరిణామాలకు దూరంగా ఉండడానికి జాగ్రత్తలు
తీసుకోంది. `క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) స్కోర్
మూడంకెలు. బ్యాంకులు, ఇతర రుణ దాతలు మీరు
రుణం కోసం పెట్టుకున్న దరఖాస్తుపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి మీ రుణ పరపతి
సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయడానికి ఈ మూడంకెల సిబిల్ స్కోర్ కీలకమవుతుంది.
బ్యాంకులు రుణాలివ్వడానికి గీటురాయి సిబిల్ స్కోర్
2021-22 ఆర్థిక
సంవత్సరంలో భారతీయుల సగటు సిబిల్ స్కోర్ 715. సాధారణంగా బ్యాంకర్లు, ఇతర రుణ
దాతలు తమ ఖాతాదారులూ, రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ 750, అంతకంటే ఎక్కువగా ఉండాలని
కోరుకుంటారు. మీరు రుణం చెల్లించగలరా..? ! లేదా..?! అన్న విషయాన్ని బ్యాంకులు,
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు అంచనా వేయడానికి సిబిల్ స్కోర్ సహాయ
కారిగా ఉంటుంది. మీ రుణ వాయిదాలు గానీ, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు గడువు మిస్
అయితే.. క్రెడిట్ కార్డు రుణం కోసం మీరు పెట్టుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించడానికి
అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఒకవేళ మీరు
ఆలస్యంగా ఈఎంఐ గానీ, క్రెడిట్ కార్డు బిల్లు గానీ చెల్లిస్తే ఏమవుతుందో తెలుసుకుందామా..!
నెలవారీ రుణ
వాయిదా (ఈఎంఐ), క్రెడిట్ కార్డు బిల్లు నిర్ణీత గడువు తర్వాత 30 రోజుల్లో చెల్లిస్తే..
ఆలస్య రుసుము చెల్లింపుతో సెట్ అవుతుంది. కానీ, తరుచుగా గడువు తర్వాత 30 రోజులు
ఆలస్యంగా చెల్లిస్తే మాత్రం మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక
చెల్లింపునకు గడువు తర్వాత 30 రోజుల టైం తీసుకుంటే మీ సిబిల్ స్కోర్ 100 పాయింట్లు
పడిపోతుంది సుమా..!
ఒకసారి ఆలస్యమైతే.. లేట్ పేమెంట్‌తో సరి.. కానీ..
తరుచుగా ప్రతి
నెలా ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు 30 రోజులు ఆలస్యంగా చేస్తే మీ సిబిల్
స్కోర్ 100 పాయింట్లు పతనం అవుతుంది. 90 రోజులు ఆలస్యమైతే దాని ప్రభావం ఏడేళ్ల
పాటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఉంటుంది. ఒకసారి మీరు మీ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం చేశారనుకోండి.
మళ్లీ మళ్లీ చేయాలనిపించినా.. క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. ఇక 120 రోజులకు
పైగా ఆలస్యమైతే మిమ్మల్ని మొండి బకాయి (ఎన్‌పీఏ) కింద జమ కడతారు. మీకు రుణం
ఇచ్చిన బ్యాంకరు, ఎన్‌బీఎఫ్‌సీ ప్రతినిధి నేరుగా మిమ్మల్ని కలిసి ఈఎంఐ వసూలు చేసుకోవడం
గానీ, థర్డ్ పార్టీ కలెక్షన్ సంస్థకు గానీ మీ ఖాతాను అప్పగిస్తారు.
మైనర్, మేజర్ డిఫాల్ట్స్‌లో తేడాలిలా
కస్టమర్లు
తప్పనిసరిగా తమ మైనర్, మేజర్ డిఫాల్ట్స్‌లో తేడాలను అర్థం చేసుకోవాలి. గడువులోపు
పేమెంట్స్ మిస్సింగ్‌కు కారణాలతోపాటు దానివల్ల వ్యక్తిగతంగా క్రెడిట్ స్కోర్‌పై
ప్రభావం ఎలా ఉంటుందో మెరుగ్గా అర్ధం చేసుకోవాలి.
గడువుకు 90 రోజుల్లోపు ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు మైనర్ డిఫాల్ట్
కిందకు వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో మీ క్రెడిట్ స్కొర్ పై దీర్ఘకాలికంగా ప్రతికూల
ప్రభావం చూపినా అది తాత్కాలికమే అవుతుంది. ఈఎంఐ చెల్లింపులు 90 రోజులకు పైగా ఆలస్యమైతే..
మీ రుణ ఖాతాను మొండి బకాయి (ఎన్‌పీఏ) జాబితాలో చేరుస్తారు. మీ రుణ చెల్లింపుల చరిత్ర
పేలవంగా ఉంటే మాత్రం.. బ్యాంకర్లు రుణం మంజూరు చేయడానికి వెనుకాడతారు. మొహమాటం
లేకుండా రుణం ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తారు.
తిరిగి ఆర్థిక స్ఙిరత్వం సాధించడం ఇలా
ఆలస్యంగా రుణ వాయిదా చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి. తద్వరా మీరు రుణాలు పొందడం సవాల్‌గా మారుతుంది. ఒకవేళ రుణం తీసుకున్నా.. వడ్డీరేట్లు పెరుగుతాయి. ఒక్కసారి రుణ వాయిదా చెల్లింపు ఆలస్యమైనా మీ క్రెడిట్ వర్తీనెస్‌ను చురుగ్గా స్పందిస్తూ చర్యలు తీసుకుంటే బలోపేతం చేసుకోవచ్చు. తిరిగి మీ సిబిల్ స్కోర్‌ను పునః నిర్మించుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ నివేదికను సమీక్షిస్తే.. మీ లేట్ పేమెంట్ ఎంట్రీని ఐడెంటిఫై చేయొచ్చు. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ మీద పడే ప్రభావం, మీ రుణ పరపతి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు మరమ్మత్తు చేసుకునేందుకు ఉపకరిస్తుంది. కనుక మీ క్రెడిట్ కార్డు బిల్లు లేదా ఇతర రుణాల నెలసరి వాయిదా (ఈఎంఐ) చెల్లించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వండి.
చెల్లింపు గడువులను పాటించడంతో
ఆర్థిక కార్యకలాపాల పట్ల మీ వ్యవహారశైలి, మీ బాధ్యత తెలుస్తుంది. చెల్లింపు
తేదీ మిస్ కాకుండా ఉండేందుకు ఆటోమేటిక్ చెల్లింపుల వ్యవస్థ, రిమైండర్ల వ్యవస్థను
ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంకులు సైతం రుణ ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విషయమై
నిత్యం మీకు మీ బ్యాంకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్, మీ బ్యాంకు యాప్ ద్వారా
రిమైండర్లు పంపిస్తూనే ఉంటాయి.
మీ ఆదాయంలో 30 శాతానికి మించి రుణాలు తీసుకోవద్దు
మీ రుణ చెల్లింపులపైనే
మీ క్రెడిట్ స్కోర్ పూర్తిగా ఆధార పడి ఉంటుంది. మీరు ఇప్పటికే తీసుకున్న క్రెడిట్
అకౌంట్ల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పాజిటివ్ క్రెడిట్ ట్రాక్ రికార్డు
నిర్మాణంపైనే దృష్టి సారించాలి. నెల వారీ మీ రుణ వాయిదాల ప్రకారం సరైన సమయానికి
రుణాలు చెల్లించడంతోపాటు మీకు లభించే క్రెడిట్‌లో 30 శాతానికంటే తక్కువగా వినియోగించుకోవాలి.
ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎప్పుడైనా ఆలస్యమైతే.. మీ బ్యాంకరును కలిసి కొంత
సమయం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే సర్దుబాటు చేయడానికి రుణ దాతలు ప్రాధాన్యం ఇస్తుంటారు.
నిత్యం సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది.. ఎందుకంటే..
`ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 30 శాతానికి మించి రుణాలు తీసుకోవడాన్ని నివారించమని మేం చెబుతాం. అధిక రుణ వినియోగం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బ తీస్తుంది.మీరు ప్రతి నెలా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. మీ సిబిల్ స్కోర్ 900 ఉంటే పర్‌ఫెక్ట్ స్కోర్ అది ` అని బ్యాంకు బజార్ సీఈఓ అదిల్ శెట్టి తెలిపారు.
`ప్రతి రుణ
దాత, క్రెడిట్ కార్డు యాజమాన్యం కూడా తమ రుణ గ్రహీతలను ఆటో డెబిట్ ఫెసిలిటీ ఏర్పాటు
చేసుకోమని సలహా ఇస్తాయి. నిత్యం నిర్దిష్ట గడువులోపు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూ
ఉండటం వల్ల.. సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం చూపే అంశాలున్నాయేమో తెలుసుకోవచ్చు`
అని వింట్ హెల్త్ కో-ఫౌండర్ కం సీఈఓ అజింక్యా కులకర్ణి చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి