27.6.21

బిట్ కాయిన్‌పై మ‌రో పిడుగు.. లావాదేవీల‌పై బ్రిట‌న్ ఆంక్ష‌లు

 


క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ‌.. ఆల్‌టైం రికార్డులు నెల‌కొల్పిన బిట్ కాయిన్ స‌హా ఇత‌ర క్రిప్టో క‌రెన్సీల‌పై మ‌రో పిడుగు ప‌డింది. ప్ర‌పంచంలోని క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్.. బినాన్స్‌..ను త‌మ అనుమ‌తి లేకుండా ఎటువంటి క్రిప్టో నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టొద్ద‌ని బ్రిట‌న్ ఫైనాన్సియ‌ల్ కండ‌క్ట్ అధారిటీ (ఎఫ్‌సీఏ) ఆదేశించింది.

రాత‌పూర్వ‌కంగా త‌మ అనుమ‌తి లేకుండా ఎటువంటి నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని బినాన్స్‌కు రెండు రోజులక్రితం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు ఎఫ్‌సీఏ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. 

బ్రిట‌న్‌లో నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు ఏ సంస్థ‌కు కూడా ఎటువంటి లైసెన్స్‌, రిజిస్ట్రేష‌న్‌, ఏ రూపంలోనూ ప్ర‌భుత్వ ధ్రువీక‌ర‌ణ లేదని ఎఫ్‌సీఏ పేర్కొన్న‌ది. 




ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే అతిపెద్ద క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్‌గా ఉన్న బినాన్స్ లావాదేవీల‌ను అమెరికా, జ‌ర్మ‌నీ త‌దిత‌ర దేశాలు నియంత్రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బ్రిట‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది. 

బినాన్స్ సంస్థ బిజినెస్ లావాదేవీల్లో హ‌వాలా నిందితులు, ప‌న్ను ఎగ‌వేత‌దారులు పాల్గొంటున్నారా? అన్న కోణంలో అమెరికా జ‌స్టిస్ డిపార్ట్‌మెంట్ అండ్ ఇంట‌ర్న‌ల్ రెవెన్యూ స‌ర్వీస్ అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

ఇన్వెస్ట‌ర్ల అనుమ‌తి లేకుండా డిజిట‌ల్ టోకెన్లు ఆఫ‌ర్ చేస్తే ఫైన్ విధిస్తామ‌ని గ‌త ఏప్రిల్‌లో జ‌ర్మ‌నీ ఫైనాన్సియ‌ల్ రెగ్యులేట‌ర్ బాఫిన్ హెచ్చ‌రించింది.

1 కామెంట్‌: