
బిల్ గేట్స్ తరువాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా స్టీవ్ బాల్మర్ 2014 వరకూ పని చేశారు. ఆయన తర్వాత 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. ఈ సంస్థకు ఆయన మూడో సీఈఓ.. మూడో చైర్మన్. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మన్‌గా థంప్సన్ బాధ్యతలు స్వీకరించారు. సంస్థ తొలి సీఈఓ కం చైర్మన్ బిల్ గేట్స్ కావడం విశేషం.

నాదెళ్ల హయాంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు
1975లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్‌లో నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు జరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ అప్లికేషన్స్, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపైనే మైక్రోసాఫ్ట్ కేంద్రీకరించింది.
చాలా కాలం కంపెనీ పర్సనల్ కంప్యూటర్ల సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలను తయారీపైనే దృష్టిపెట్టింది. కానీ, సత్య నాదెళ్ల మొబైల్ రంగం వైపు కూడా సంస్థను నడిపించారు.
కొత్తతరం టెక్నాలజీ వైపు సంస్థను ముందుకు తీసుకెళ్లారు. దీంతో మొబైల్ రంగంపై ఎక్కువ దృష్టిపెట్టింది. అప్పటికే ఈ విభాగంలో ఆపిల్, గూగుల్ పనిచేస్తున్నాయి.
ఏడు రెట్లు పెరిగిన షేర్లు
సీఈవోగా సత్య నాదెళ్ల హయాంలో మైక్రోసాఫ్ట్ షేర్లు ఏడు రెట్లకు పైగా వ్రుద్ధి చెందాయి. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరువలో ఉంది.
గతేడాది కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనా మైక్రోసాఫ్ట్ మంచి ఫలితాలు సాధించింది. షేర్ల రీ పర్చేజ్, డివిడెండ్ల రూపంలో వాటాదారులకు 35 బిలియన్ల డాలర్ల రిటర్న్స్‌తోపాటు సత్ఫలితాలను అందించింది.
అసాధారణ రీతిలో కోవిడ్-19 ప్రభావం చూపినా సంస్థలో సమూల మార్పు తీసుకు రావడంలో సత్యనాదెళ్ల అద్భుతమైన పురోగతి సాధించారని మైక్రోసాఫ్ట్ అభిప్రాయ పడింది. ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న థంప్సన్ ఇక ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి